వర్షాకాలం ఆరంభం అవుతుండటంతో.. ఆటోమొబైల్ కంపెనీలు తమ వినియోగదారులకు ముందస్తు సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగాంగానే యూరోపియన్ కంపెనీ స్కొడా ఆటో భారత యూనిట్ అయిన 'స్కొడా ఆటో ఇండియా' దేశవ్యాప్తంగా ప్రీ-మాన్‌సూన్ చెకప్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఈ క్యాంపులకు వచ్చే స్కొడా వాహన వినియోగదారులకు 30-పాయింట్ చెకప్ నిర్వహిస్తామని, లితంగా రాబోవు వర్షాకాలాన్ని తట్టుకోవడానికి సదరు వాహనాలు సిద్ధంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది.
భారతదేశంలో ఉన్న అన్ని స్కొడా సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ క్యాంపులు నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. ఈ క్యాంపు తమిళనాడులో మాత్రం ఆగస్టు 15, 2011 నుండి ఆగస్టు 21, 2011 వరకూ ఉంటుందని మిగిలిన అన్ని రాష్ట్రాలలో జూన్ 15, 2011 నుంచి జూన్ 30, 2011 వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొంది.