1,500 బుకింగ్‌లను సొంతం చేసుకున్న స్కొడా ర్యాపిడ్

Skoda Rapid
చెక్-రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కొడా ర్యాపిడ్ సెడాన్ భారత మార్కెట్లో సూపర్‌హిట్ అయింది. అతితక్కువ ధరతో, విశిష్టమైన ఫీచర్లతో లభిస్తున్న స్కొడా బ్రాండ్ ర్యాపిడ్ కారు కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈనెల 16న దేశీయ విపణిలోకి ప్రవేశించిన స్కొడా ర్యాపిడ్ సెడాన్ ఇప్పటి వరకూ 1,500 యూనిట్లకు బుకింగ్‌లను సొంతం చేసుకుంది.

కంపెనీ మొట్టమొదిటిసారిగా స్కొడా ర్యాపిడ్ సెడాన్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించిందని, ఈ ఛానెల్ ద్వారా 25కు పైగా కార్లను విక్రయించిందని స్కొడా ఆటో ఇండియా బోర్డ్ మెంబర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) థామస్ కుయెల్ తెలిపారు. సమీప భవిష్యత్తులో మరిన్ని స్కొడా మోడళ్లకు ఆన్‌లైన్ బుకింగ్‌లను పరిచయం చేయాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు.

ఫ్యాబియా, యెటిలలో కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని, వచ్చే ఏడాది కంపెనీ మొత్తం అమ్మకాలలో 50 శాతం ర్యాపిడ్ సెడాన్ అమ్మకాలే ఉంటాయని, మొత్తం డీజిల్ కార్ల అమ్మకాలలో 70 శాతం ర్యాపిడ్ అమ్మకాలు ఉంటాని అంచనా వేస్తున్నామని కుయెల్ చెప్పారు. స్కొడా ర్యాపిడ్ సి-సెగ్మెంట్లోని హోండా సిటీ, ఎస్ఎక్స్4, వెర్నా వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

దేశీయ విపణిలో స్కొడా ర్యాపిడ్ సెడాన్ (పెట్రోల్ వేరియంట్) ప్రారంభ ధర రూ.6.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్ ప్రారంభ ధర రూ.6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. స్కొడా ర్యాపిడ్ సెడాన్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. అందులో రెండు పెట్రోల్ వేరియంట్లు కాగా.. మరొకటి డీజిల్ వేరియంట్.

More from DriveSpark

Article Published On: Monday, November 28, 2011, 11:23 [IST]
English summary
The Czech carmaker Skoda Auto India's latest offering sedan Skoda Rapid receiving an overwhelming response from Indian buyers. It has crossed the 1,500 booking mark within days of launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+