85 వసంతాలు పూర్తి చేసుకున్న స్కొడా 'రెక్కల బాణం'

లారియన్ అండ్ క్లెమెంట్‌గా 1895లో ఆవిర్భవించిన స్కొడా తొలుత సైకిల్ తయారీదారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిది. 1905 నాటికి స్కొడా తన తొలి కారును విడుదల చేసింది. పిల్సెన్‌కు చెందిన ఈ పారిశ్రామిక కంపెనీ లగ్జరీ వాహనాలను ఉత్పత్తి చేయడానికి 1924లో స్పానిష్ కంపెనీ అయిన హిస్పానో-సుయిజా నుంచి లైసెన్సు పొందింది. దీనికి ఒక ఏడాది ముందు అంటే 1923లో లారియన్ అండ్ క్లెమెంట్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీతో స్కొడా విలీనం అయింది. 1925 వసంత కాలంలో తొలి వాహనం ఉత్పత్తిని ప్రారంభించింది.
ఆ మొదటి వాహనాన్ని తయారు చేయడానికి స్కొడాకు మే 1926 వరకూ సమయం పట్టింది. ప్రతి ఒక్క స్కొడా హిస్పానో-సుయిజా వాహనం 25/100 పిఎస్‌ల శక్తితో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మలిచేవారు. దీంతో ఏ రెండు కార్లను గమనించినా ఒకదానితో ఒకటి పోలిక ఉండదు. దాదాపు 2,700 కిలోగ్రాముల బరువు ఉండే ఆ కార్లు గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేవి. అప్పట్లో ఈ కారు ధర మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర కార్ల ధర కన్నా చాలా ఎక్కువ. వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా మార్చుకుంటే ఇది సుమారు 14,000 న్యూజిలాండ్ డాలర్ల నుంచి 17,000 (ఇప్పటి మన భారత కరెన్సీ ప్రకారం ఇది రూ. 6 లక్షల పైమాటే) న్యూజిలాండ్ డాలర్ల డాలర్ల వరకూ ఖర్చయ్యేది. ఇదీ క్లుప్తంగా స్కొడా 85 ఏళ్ల చరిత్ర.


Click it and Unblock the Notifications








