కొత్త స్విఫ్ట్ ఎఫెక్ట్: జులైలో 25% తగ్గిన మారుతి అమ్మకాలు

Maruti Sales
కొత్త స్విఫ్ట్‌ను విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత స్విఫ్ట్ ఉత్పత్తిని మరియు డెలివరీలను మారుతి సుజుకి నిలిపివేయడం కంపెనీ విక్రయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. జులై 2010లో మారుతి సుజుకి 11,828 యూనిట్లను డెలివరీ చేస్తే జులై 2010లో కేవలం 348 యూనిట్లను మాత్రమే డెలవరీ చేసింది. ఏదేమైనప్పటికీ.. ఈ ఆగస్టు నెల మధ్య భాగంలో మార్కెట్లోకి రానున్న కొత్త స్విఫ్ట్‌కు మార్కెట్‌ను భారీ స్పందన లభిస్తోంది. ఈ కారుకు ఇప్పటికే 38,000 లకు పైగా బుకింగ్‌లు రావటం విశేషం.

దేశపు అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) జులై 2011 నెల అమ్మకాలు 25 శాతం క్షీణించాయి. పెరిగిన పెట్రోల్ ధరలు, వడ్డీ రేట్లు వంటి ప్రతికూల మార్కెట్ పరిస్థితులు కూడా కంపెనీ అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. గతేడాది జులై నెలతో పోలిస్తే.. ఈ ఏడాది జులై నెల అమ్మకాలు 75,300 యూనిట్లకు పడిపోయాయి. జులై 2010లో మారుతి సుజుకి అమ్మకాలు 1,00,857 యూనిట్లుగా ఉన్నాయి.

గత నెలలో స్విఫ్ట్‌ బ్రాండ్‌లో అందుబాటులో ఉన్న సెడాన్ వేరియంట్ 'స్విఫ్ట్ డిజైర్' అమ్మకాలు తగ్గడం గమనార్హం. జులై 2011లో 5,471 స్విఫ్ట్ డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. అయితే.. మానేసర్ ప్లాంటులో తలెత్తిన కార్మికుల వివాదం కారణంగా స్విఫ్ట్ డిజైర్ ఉత్పత్తిని మానేసర్ ప్లాంటు నుంచి గుర్గావ్ ప్లాంటుకు మార్చాలని కంపెనీ నిర్ణయించడంతో ఇది కూడా స్విఫ్ట్ డిజైర్ ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపింది.

More from DriveSpark

Article Published On: Monday, August 1, 2011, 16:22 [IST]
English summary
Maruti Suzuki India, the country's largest carmaker has said its sales in July had plunged by 25.34 per cent. The carmaker sold 75,300 units in July this year as against previous year's sales of 1,00,857 units. Maruti Suzuki's sales during the previous July was buoyed by the strong spurt in the car market that lasted the whole year. Sales have seen a sharp decline following the steep increase in fuel prices and bank interest rates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+