భారత మార్కెట్లోకి హిందుస్థాన్ మోటార్ చిన్నకారు

అంబాసిడర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ కారు హ్యాచ్‌బ్యాక్, సెడాన్ వేరియంట్లలో లభించనుంది. అయితే ఇది పొడవులో అంబాసిడర్ కన్నా చిన్నగా ఉంటుంది కాబట్టి దీని ధర కూడా తక్కువగా ఉండవచ్చునని అంచనా. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హిందుస్థాన్ మోటార్‌కు ఇది తొలి ప్రవేశం. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రం ద్వారా హెచ్ఎమ్ ఈ చిన్నకార్లను తయారు చేయనుంది. ప్రస్తుతం అంబాసిడర్ కారు ప్రతినెలా 700 నుంచి 800 యూనిట్లు అమ్ముడవుతున్నాయని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








