ఇండియా, చైనాలకు చిన్న కార్లు వస్తున్నాయ్: ఫోర్డ్ మోటార్

భారత్, చైనాలలో అందిస్తున్న సబ్‌కాంపాక్ట్ కారు 'ఫియస్టా' కన్నా చిన్న కార్లు తమ వద్ద ఉన్నాయని, వాటిని ఈ దేశాలలో విక్రయించడం వల్ల తక్కువ లాభాలు మాత్రమే వస్తాయని, అయినప్పటికీ ఆ కార్లను అధిక సంఖ్యలో విక్రయించడం ద్వారా ఫోర్డ్ లాభాలను ఆర్జిస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ జో హిన్రిచ్స్ తెలిపారు.చైనాలో ఫోర్డ్ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని గట్టి పోటీ ఇవ్వాలంటే ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
చైనా కార్ మార్కెట్లో 70 శాతం వాటా చిన్న కార్లదేనని, చిన్న కార్ల సెగ్మెంట్లో ఫోర్డ్ మరిన్ని ఉత్పత్తులను అందిచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం చైనాలో ఫోర్డ్ ఒక మోడల్ (ఫియస్టా)ను మాత్రమే అందిస్తోంది, 2015 నాటికి 15 మోడళ్లను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే భారత్‌లో కూడా ఫోర్డ్ ఇటీవల ప్రవేశపెట్టిన చిన్న కారు ఫిగో ఘన విజయం సాధించడంతో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది.
గల్ఫ్ దేశాలు మరియు ఉత్తర అమెరికాతో కలిపి దాదాపు 50 దేశాలలో ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారు అమ్ముడవుతోంది. చైనా, భారత్‌లలో కలిపి ఫోర్డ్ మార్కెట్ 2.6 నుంచి 2.7 శాతం మాత్రమే. 2020 నాటికి 13 శాతానికి పెరగవచ్చునని కంపెనీ అంచనా వేస్తుంది.


Click it and Unblock the Notifications








