చెవర్లెట్ స్మార్టెక్ ఇంజన్ ఆవిష్కరించిన జనరల్ మోటార్స్

ఈ ఇంజన్ సామర్ధ్యాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించామని, కార్ల వేగం, సామర్ధ్యాన్ని ఈ ఇంజన్ ద్వారా పెంచుకోవచ్చని కంపెనీ వివరించింది. మరోవైపు భారత్‌లో చిన్నతరహా వాణిజ్య వాహనాల (లైట్ కమర్షియల్ వెహికల్స్)ను ఈ ఏడాది చివర్లో కానీ లేదా.. వచ్చే ఏడాది ఆరంభంలో కానీ విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా.. హలాల్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా జనరల్ మోటార్స్ అప్‌గ్రేడ్ చేయనుంది. హలాల్ ప్లాంటులో ప్రస్తుత ఉత్పత్తి సమార్థ్యం సాలీన 85,000 యూనిట్లు ఉండగా.. దానిని లక్ష యూనిట్లకు పెంచాలని కంపెనీ భావిస్తోంది. 2010లో జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో 60 శాతం వృద్ధిని సాధించింది. మార్కెట్లో తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు కంపెనీ ఇప్పటికే రూ. 5,000 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించింది.


Click it and Unblock the Notifications








