మహీంద్రా బొలెరో గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

మహీంద్రా బొలెరో గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:
* మహీంద్రా మొత్తం అమ్మకాలు 50 శాతం బొలెరో వాహనాలే ఉంటాయి.
* మహీంద్రా అందిస్తున్న ఎస్‌యూవీలలో బొలెరోనే చవకైనది.
* బారత ఆటోమొబైల్ మార్కెట్లోని ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న భారతదేశపు నెంబర్ వన్ ఎస్‌యూవీ "మహీంద్రా బొలెరో"
* బొలెరోను మహీంద్రా మిస్టర్ డిపెండబిల్, రాహుల్ ద్రావిడ్‌తో పోలుస్తుంది. అందుకే వాళ్లు ఈ వాహనాన్ని మిస్టర్ డిపెండబిల్ అని పిలుస్తారు.
* ఎస్‌యూవీ మార్కెట్ వాటాలో బొలెరో 35 శాతం వాటాను కలిగి ఉంది.
* గడచిన 10 ఏళ్ల క్రితం బొలెరో మార్కెట్లోకి వచ్చింది, ప్రస్తుతం 4,00,000 బొలెరోలు రోడ్లపై ఉన్నాయి.
* మహీంద్రా 2007లో బొలెరోను ఎంట్రీలెవల్ ఎస్‌యూవీగా రీపొజిషన్ చేసింది.
* ప్రస్తుత సంవత్సరంలో బొలెరో అమ్మకాలు 27 శాతం మేర పెరుగుతున్నాయి.
* భారత్‌లో అమ్మకాల సంఖ్య పరంగా వరుసగా ఐదేళ్లు నెం.1 ఎస్‌యూవీ బ్రాండ్‌గా ఉంది.
* భారత్‌లోని టాప్ టెన్ కార్లల బొలెరో కూడా ఒకటి. బొలెరోది ఆరవ స్థానం.
ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తతో మూడు వేరియంట్లలో లభించే బొలెరో ఎక్స్-షోరూమ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* మహీంద్రా బొలెరో ఎస్ఎల్ఈ బిఎస్3 రూ. 6.19 లక్షలు, బిఎస్4 రూ. 6.33 లక్షలు
* మహీంద్రా బొలెరో ఎస్ఎల్ఎక్స్ బిఎస్3 రూ. 6.67 లక్షలు, బిఎస్4 రూ. 6.81 లక్షలు
* మహీంద్రా బొలెరో జెడ్ఎల్ఎక్స్ బిఎస్3 రూ. 6.82 లక్షలు, బిఎస్4 రూ. 6.96 లక్షలు


Click it and Unblock the Notifications








