అతి త్వరలో మార్కెట్లోకి రానున్న సోనాలికా ప్యాసింజర్ కార్లు

"మేము అతి త్వరలోనే చాలా కొత్త మోడళ్లతో వస్తున్నామ"ని సోనాలికా గ్రూప్ ఛైర్మన్ ఎల్.డి. మిట్టల్ తెలిపారు. తాము ఓ ప్రపంచపు కారు సెడాన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఏడాది మధ్య భాగంలో ఈ కారును విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు. యూరోపియన్ లగ్జరీ కార్లలో ఉండే విధంగా ఇందులో అన్ని ప్రీమియం ఫీచర్లు ఉంటాయని, అక్కడి కార్ల ధరలతో పోలిస్తే సగం ధరకే భారత్‌లో తమ కారు అందుబాటులో ఉంటుందని మిట్టల్ చెప్పారు. ఈ కొత్త ప్యాసింజర్ కార్ల శ్రేణిని ప్రారంభించేటప్పుడు, వీటితో పాటుగా ఓ కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించడంపై దృష్టి సారిస్తున్నామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








