సరికొత్త ఎస్‌యూవీ విడుదల చేసేందుకు సోనాలికా సన్నాహాలు

Sonalika SUV
కొనుగోలుదారులు పెరుగుతుండటంతో భారత ప్యాసింజర్ కార్ మార్కెట్ కూడా నానాటికీ విస్తరిస్తోంది. ఈ తరుణంలో వివిధ ఆటోమొబైల్ సంస్థలు ప్యాసింజర్ కార్ విభాగంలో తమ హవాను చాటుకునేందుకు పోటీపడుతున్నాయ. టెంపో, ట్రాక్స్ వంటి వాణిజ్య వాహనాల తయారీ పేరుగాంచిన ఫోర్స్ మోటార్స్ ఇటీవలే ప్యాసింజర్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించి ఫోర్స్ వన్ ఎస్‌యూవీని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పరికరాల తయారీలో పేరుగాంచిన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం సోనాలిక కూడా ప్యాసింజ్ ఎస్‌యూవీ విభాగంలో తన ప్రస్థానాన్ని విస్తరించుకోవాలని భావిస్తోంది. ఇటలీకు చెందిన డిజైన్ హౌస్ పినిన్‌ఫరీనాతో చేతులు కలిపి సోనాలికా గ్రూపు ఓ కొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ కొత్త వాహనం మార్కెట్లో రానున్నట్లు తెలుస్తోంది.

ఈ మోడల్ విడుదల అనంతరం ఇదే జాయింట్ వెంచర్ నుంచి మరో రెండు కొత్త మోడళ్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. సోనాలికా నుంచి తొలుత ఓ మిడ్-సైజ్ సెడాన్ కారు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ధరను కలిగి ఉండి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో రావచ్చునని అంచనా. ఇక రెండో ఉత్పత్తిగా ఓ ఎస్‌యూవీ (స్పోర్ట్ యుటిలిటీ వాహనం)ను రూ. 10 లక్షల ధరతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

సోనాలికా నుంచి మార్కెట్లోకి రానున్న ఎస్‌యూవీ ఇటీవలే విడుదలైన ఫోర్స్ వన్, మహీంద్రా స్కార్పియో, టాటా సఫారీలకు ధీటుగా నిలువనుంది. ఈ ప్యాసింజర్ వాహన ప్రాజెక్టు కోసం ప్రారంభంగా కంపెనీ రూ. 500 కోట్ల పెట్టుబడులను వెచ్చించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ విషయంపై స్పందించేందుకు సోనాలికా అధికార ప్రతినిధి నిరాకరించారు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2011, 17:48 [IST]
English summary
Commercial vehicle maker Sonalika is planning to expand their foot prints in passenger car market by launching new products. To develop new cars Sonalika group joins hands with Italian design house Pininfarina.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+