వాహనాలపై మైలేజ్‌ను తెలిపే రేటింగ్ విధానానికి శ్రీకారం!

Car Ratings
కార్ల మైలేజ్ గురించి ఇక చింతించాల్సి అవసరం లేదు. మైలేజ్ విషయంలో డీలర్లు చెప్పే భటకపు మాటలకు ఇక తెరపడనుంది. సాధారణంగా టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసిలు వంటి గృహోపకరణాలకు ఖర్చు అయ్యే విద్యుత్తును తెలిపేందుకు వాటిపై రేటింగ్‌ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అదే విధంగానే ఇకపై వాహనాలకు కూడా, ప్రభుత్వం ఆమోదించిన ఇంధన సామర్థ్య (ఫ్యూయెల్ ఎఫీషిన్సీ) రేటింగ్‌ను ఇవ్వనున్నారు. రేటింగ్‌ను బట్టి సదరు వాహనం ఇంధన సామర్థ్యం ఏంటో తెలుసుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి వాహన రంగాన్ని రేటింగ్‌ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో సగటు వినియోగాదరుడి మెదడులో మొదటిగా మెదిలే ప్రశ్న మైలేజ్ ఎంత..? అని. ఈ మేరకు ఒక వాహనం యోక్క ఇంధన సామర్థ్యాన్ని సులువుగా తెలుసుకునేందుకు ఈ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫ్యూయెల్ ఎఫీషియన్సీ లేబిలింగ్ రూల్స్‌ను బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) దాదాపుగా ఖరారు చేసింది. మార్చి 2012 నుంచి వాహనాలపై ఫ్యూయెల్ ఎఫీషియన్సీ లేబుల్స్‌ను ప్రదర్శించడం తప్పనిసరిగా మారనుంది. ఇకపై కొత్త కార్లు ఈ లేబుల్ లేకుండా రోడ్లపై తిరగడానికి లేదు.

ఈ మైలేజ్ రేటింగ్ విధానం ద్వారా వాహనం యొక్క ఇంధన సామర్థ్యాన్ని తెలుసుకోవడంతో పాటు అదే రేంజ్‌లో ఉన్న ఇతర బ్రాండ్ వాహనాల యొక్క మైలేజ్‌ను సరిపోల్చుకొని మైలేజ్ విషయంలో ఏ వాహనం మంచిదో తెలుసుకోవచ్చు. ఈ రేటింగ్ విధానం వల్ల కంపెనీలు ప్రతిపాధించే మైలేజ్‌కు వాళ్లు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాలం చెల్లిపోయిన పాత ఇంజన్లకు ఇది స్వస్తి పలకనుంది. దీంతో ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త టెక్నాలజీలను ఉపయోగించి ఇంజన్లను రూపొందించడం వ్లల భవిష్యత్తులో ఇంధనం ఆదా అవుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 10, 2011, 14:24 [IST]
English summary
Very soon Cars too have a fuel efficiency labels like TV, Fridge, AC etc. Soon customer will be able to compare the models based on government certified fuel efficiency labels before making a final choice.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+