త్వరలో భారత్‌కు రానున్న శాంగ్‌‌యాంగ్ కొరాండో, రెక్స్‌టాన్

Ssangyong Rexton
దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటో కంపెనీ శాంగ్‌యాంగ్ నుండి ఓ రెండు కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఇందులో మొదటగా.. శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీని ఎమ్ అండ్ ఎమ్ విడుదల చేయనుంది. కొరాండో విడుదల అనంతరం రెక్స్‌టాన్ ఎస్‌యూవీని కూడా ప్రవేశపెట్టనుంది.

మనదేశపు రోడ్లపై శాంగ్‌యాంగ్ ఇప్పటికే రెక్స్‌టాన్ ఎస్‌యూవీ టెస్ట్ చేస్తోంది. దీనికి సంబంధించిన చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా.. శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ 2.2 లీటర్ టర్బోచార్జ్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉండి 175 బిహెచ్‌పిల శక్తిని, 360 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణింగచగలిగే కొరాండో ఎస్‌యూవీ ఈ ఏడాది చివరి నాటికి కానీ లేదా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కానీ కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఇకపోతే, ప్రస్తుతం అమ్మకంలో ఉన్నది రెండవ తరానికి చెందిన రెక్స్‌టాన్ ఎస్‌యూవీ. ఇది 5-సీటర్ లేదా 7-సీటర్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించే రెక్స్‌టాన్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు చక్కగా సరిపోతుంది. ఇది 5-సిలిండర్ 2.7 లీటర్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌తో 165 బిహెచ్‌పిల శక్తిని, 340 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

రెక్స్‌టాన్ ఎస్‌యూవీ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తోనే కాకుండా మెర్సిడెస్ బెంజ్ ద్వారా డిజైన్ చేయబడిన 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో కూడా లభ్యమవుతుంది. ఇది వచ్చే ఏడాది ఆరంభంలో దేశీయ మార్కెట్లో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 22, 2011, 13:11 [IST]
English summary
Mahindra and Mahindra's owned Korean auto major Ssangyong plans to introduce Rexton II and Korando in the Indian market soon. Korando, designed in Europe, for a European audience, will be fine tuned for India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+