2016 నాటికి నాలుగు కొత్త మోడళ్లు: శాంగ్‌యాంగ్

Ssangyong SUV
దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్వాధీనం చేసుకున్న దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్ వచ్చే ఐదేళ్లలో నాలుగు కొత్త మోడళ్లను అలాగే, 2013 నాటికి ఐదు ఫేస్‌లిఫ్ట్ (అప్‌గ్రేడ్ చేయబడిన) మోడళ్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా తమ అమ్మకాలను పెంచుకునేదిశగా కంపెనీ తన మార్కెట్ల సంఖ్యను, ఉత్పత్తుల పరిమాణాన్ని విస్తరిస్తోంది.

ఇవి మాత్రమే కాకుండా.. శాంగ్‌యాంగ్ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా అభివృద్ధి చేసి, ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. వీటితో పాటుగా ఇతర మార్కెటింగ్, బ్రాండ్ ప్రణాళికలతో మార్కెట్ వాటాను 20 శాతానికి పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఇంకా కంపెనీ రెండు మధ్యంతర వాణిజ్య లక్ష్యాలను కూడా వెల్లడించింది.

"ప్రామిస్ 2013" లక్ష్యంలో 2013 నాటికి 1,60,000 వాహనాలను విక్రయించి, నాలుగు ట్రిలియన్ల ఆదాయాన్ని ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపోతే రెండో లక్ష్యం "ఆస్పిరేషన్ 2016". ఈ లక్ష్యంలో 2016 నాటికి 3,00,000 లక్షల వాహనాలను విక్రయించి, కంపెనీ ఆదాయాన్ని ఏడు ట్రిలియన్లను సాధించాలని భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 22, 2011, 10:28 [IST]
English summary
Indian automajor Mahindra and Mahindra (M and M) owned South Korean carmaker Ssangyong Motor Co said it will launch four new models by 2016 and five facelifts by 2013 to boost sales across the world.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+