ఎమ్&ఎమ్‌లో యథావిధిగా కొనసాగనున్న శాంగ్‌యాంగ్ ఉద్యోగులు

ఇందుకు సంబంధించి సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ఓ డ్రాఫ్ట్ ప్రపోజల్‌ను కూడా రూపొందించింది. అయితే.. ఈ వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునే సమయంలో ప్రస్తుతం శాంగ్‌యాంగ్‌లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగుల సేవలను ఉపసంహరించాలని ఎమ్ & ఎమ్ అప్పట్లో నిర్ణయించుకుంది. కానీ ప్రస్తుతానికి ఈ డీలిస్టింగ్ ప్రక్రియను మహీంద్రా అండ్ మహీంద్రా వాయిదా వేసుకుంది. దీంతో ఎప్పటిలాగే శాంగ్‌యాంగ్ యాజమాన్యం సొంతంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
అయితే ఈ కార్యకలాపాలు మాత్రం పూర్తిగా ఎమ్ & ఎమ్ ఆధ్వర్యంలో శాంగ్‌యాంగ్ మద్దతు, సహకారంతో జరుగుతుంటాయాని కంపెనీ పేర్కొంది. మహీంద్రా అండ్ మహీంద్రా అధ్యక్షుడు (ట్రాక్టర్, ఆటోమోటివ్ విభాగం) పవన్ గియెన్కా మాట్లాడుతూ.. కంపెనీకు క్రెడిటార్ల (రుణదాతలు) నుంచి చాలా ప్రపోజల్స్ వస్తున్నాయని, దీని తుది ప్రక్రియ ఫిబ్రవరిలో ఉంటుందని చెప్పారు.


Click it and Unblock the Notifications








