ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీతో మీ కారు మరింత భద్రం..!

డ్యూయెల్ బ్యాండ్ జిఎస్ఎమ్ (900/1800) మెసేజింగ్ సిస్టమ్, ఫింగర్‌ప్రింట్ ఇగ్నిషన్ లాక్ మరియు స్టాండర్డ్ కార్ అలారమ్ స్టైల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లతో ఈ గాడ్జెట్ లభిస్తుంది. ఇలా రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్లు మాత్రమే కారును నడపటానికి వీలుంటుంది. ఇందులో ఉండే 'సివికెపి-బిజి04' స్టాండర్డ్ అలారమ్‌లా పనిచేస్తుంది. కారు డోరును ఎవరైనా బలవంతంగా ఓపెన్ చేయాలని ప్రయత్నించినా, లేదా కారును ఏదైనా వాహనం ఢీకొట్టిన వెంటనే అలారం యాక్టివేట్ అయి అప్రమత్తం చేసి మీ మొబైల్‌కు ఎస్ఎమ్ఎస్ చేస్తుంది.
అప్పటికీ.. దుండగులు కారును చోరీ చేసినా.. ఒక్క ఎస్ఎమ్ఎస్ పంపితే ఇంజన్‌కు ఇంధన సరఫరా ఆగిపోయి కారు పనిచేయడం మానేస్తుంది. అంతేకాదు.. ఇందులో ఉండే మరో అత్యాధనిక ఫీచర్ రూట్ ట్రాకింగ్. ఉదాహరణకు మీ శ్రీవారు మీతో ఇంటికి వస్తానని చెప్పి కారులో ఏ బార్‌కో లేక మరేచోటుకో వెళ్తున్నారనుకోండి, కారులో ఉండే సిస్టమ్‌కు మెసేజ్ పంపడం ద్వారా అది ఏ రూట్లో ప్రయాణిస్తుందో, లేక అస్సలు వాహనం గమనంలో లేదో కూడా తెలుసుకోవచ్చు.
ఈ గాడ్జెట్ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు:
* ఫింగర్‌ప్రింట్ సేవ్/స్కాన్/డిలీట్ (9 ఫింగర్‌ప్రింట్‌లను స్టోర్ చేసుకోవచ్చు).
* కీచెయిన్ రిమోట్ లాక్/అన్‌లాక్, ఆర్మ్/డిస్‌ఆర్మ్.
* యాంటీ-రాబింగ్ ( ఇంజన్‌కు ఇంధన సరఫరాను కట్ చేస్తుంది) వయా ఎస్ఎమ్ఎస్.
* స్టేటస్ వార్నింగ్ వయా ఎస్ఎమ్ఎస్.
* కార్ స్టేటస్ ఎంక్వైరీ వయా ఎస్ఎమ్ఎస్.
* సెన్సిటివిటీ అడ్జెస్ట్‌మెంట్.
* క్యాన్సెల్/రెజ్యూమ్ ఫింగర్‌ప్రింట్ వెరిఫికేషన్/అలారమ్.
* ఇతరులకు కారు ఇవ్వదలచినప్పుడు తాత్కాలికంగా ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








