యూరప్‌లో దొంగిలించిన లగ్జరీ కార్లు భారత్‌లో విక్రయం!!

ఆస్టన్ మార్టిన్, ఫెరారీ, రోల్స్ రాయిస్, బెంట్లీ, హమ్మర్స్, లాంబోర్గిని వంటి లగ్జరీ కార్లను యూరోపియన్ దేశాలు మరియు దక్షిణాఫ్రికాలలో దొంగిలించి నకిలీ ఇన్వాయిస్ (బిల్లు)తో వాటిని భారత్‌లోకి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయించడం జరుగుతోంది. డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ (డిఆర్ఐ) ఇటీవలే ఇలాంటివి కనీసం 40 వాహనాలను సీజ్ చేసింది. ఢిల్లీకు చెందిన ఓ హై ప్రొఫైల్ ఆటో వర్క్‌షాప్ కలిగిన యజమాని సుమిత్ వాలియా ఈ రాకెట్‌లో అడ్డంగా బుక్ అయ్యాడు.
ఈ కేసుకు సంబంధించి ఓ డిఆర్ఐ అధికారి మాట్లాడుతూ.. ఈ కేసులో మేము కనుగొన్న కార్లు కేవలం మంచు కొండలో ఓ చిన్న ముక్క లాంటివి మాత్రమే, వాస్తవానికి ఇలా దొంగిలించిన కార్లు దాదాపు 300-400 వరకూ ఉండవచ్చు, ఈ కేసులో పూర్తి విచారణ జరిగిన తర్వాతనే ఓ నిర్థారణకు రాగలమని చెప్పారు. కాగా.. ఈ ఏడాది ఆరంభంలో కూడా ఇంగ్లాండ్ నుంచి కార్లను దొంగిలించి సైప్రస్‌లో విక్రయించే ఇలాంటి ఓ కార్ల దొంగల ముఠాను స్కాట్‌లాండ్ యార్డ్ బట్టబయలు చేసింది.
దీనికి వెనుక పెద్ద తతంగమే ఉంది. తొలుత తన ఏజెంట్ల ద్వారా కొనుగోలుదారులను గుర్తించిన సుమిత్, డిమాండుకు అనుగుణంగా యూరప్, దుబాయ్‌లో ఉన్న కార్ల దొంగల ముఠాలకు ఆర్డర్లు ప్లేస్ చేస్తాడు. ఆ తర్వాత వాటికి నకిలీ పేపర్లు రూపొందించి ఇండియాలోకి దిగుమతి చేసుకుంటాడు. యూకే, ఐర్లాండ్ దేశాల కార్లు రైట్-హ్యాండ్ డ్రైవ్‌ను కలిగి ఉంటాయి కాబట్టి అవి భారత రోడ్లకు సరిపోతాయి. అలాగే లెఫ్ట్-హ్యాండ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉన్న కార్లను దుబాయ్‌లోని వర్క్‌షాపులలో వాటిని రైట్-హ్యాండ్ డ్రైవ్‌గా మార్చి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది.
ఇందులో కొన్ని దౌత్య కార్యాలయాలకు కూడా సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 2 కోట్లు విలువ చేసే ఓ ఆస్టన్ మార్టిన్ కారును భారత క్లైంట్ కోసం ఓ దౌత్య కార్యాలయం దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం ఆ కారును సీజ్ చేసి లబ్దిదారుడిని, సదరు దౌత్యవేత్తను ఇద్దరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిల్లో ఇప్పటికే చాలా కార్లు బ్రిటన్‌లో రిజిస్టర్ అయి ఉన్నాయని, అక్కడి నుండి వీటిని భారత్‌కి ఎగుమతి చేసేటప్పుడు నకిలీ ఇన్వాయిస్‌లను రూపొందిస్తున్నారని డిఆర్ఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాబట్టి లగ్జరీ కార్ల ప్రియుల్లరా... కేవలం కారు మెరుపులను మాత్రమే చూడకండి! జాగో గ్రాహక్.. జాగో..!


Click it and Unblock the Notifications








