మారుతి ప్లాంటులో నాలుగో రోజుకు చేరిన వర్కర్ల సమ్మె

Strike at Maruti Manesar Plant
మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్‌ఈయూ)ను యాజమాన్యం గుర్తించాలంటూ కంపెనీ వర్కర్లు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకి చేరింది. ప్లాంటులో పరిస్థితి సోమవారం మాదిరిగానే ఉందని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా.. అక్రమంగా సమ్మె చేస్తున్నారంటూ సోమవారం 11 మంది కార్మకులను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) ఛైర్మన్ ఆర్.సి. భార్గవ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దాదాపు 2,000 మంది కార్మికులు గత శనివారం మధ్యాహ్నం నుంచి సమ్మె చేస్తున్నారు. సమ్మె కారణంగా నిన్నటి వరకూ కంపెనీ సుమారు 1,800 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయింది. దీని వల్ల కంపెనీకు దాదాపు వంద కోట్ల రూపాయల నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మానేసర్ ప్లాంటులో రెండు షిఫ్టుల ద్వారా కంపెనీ రోజుకు 1,200 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంటులో స్విఫ్ట్, ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను మరియు డిజైర్, ఎస్ఎక్స్4 సెడాన్ మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. సమ్మె ప్రభావం కంపెనీ షేర్లపై పడుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 7, 2011, 13:57 [IST]
English summary
The strike by workers at India's largest car maker Maruti Suzuki India (MSI) at Manesar plant entered its fourth day today and production continued to be completely affected. On Monday Company sacked 11 workers employed at its Manesar facility, which has been crippled by a strike since Saturday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+