ఆరవ రోజుకు చేరిన సమ్మె: నష్టం అంచనా రూ. 210 కోట్లు

కాగా.. మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ)ను యాజమాన్యం గుర్తించాలంటూ కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో ఆరవ రోజుకు చేరుకుంది. ఈ రోజు పరిస్థితి కూడా నిన్నటి మాదిరిగానే ఉందని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సమ్మె కారణంగా నిన్నటి వరకూ కంపెనీ దాదాపు 4,200 యూనిట్లను ఉత్పత్తి నష్టపోయినట్లు అంచనా. దీని విలువ సుమారు 210 కోట్ల రూపాయలు. గడచిన శనివారం నుంచి ఈ ప్లాంటులో సమ్మె కొనసాగుతుంది.
కార్మికుల డిమాండ్ల యాజమాన్యం కూడా ససేమిరా అంటోంది. వర్కర్ల డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని కంపెనీ ఛైర్మన్ ఆర్.సి. భార్గవ గురువారం ప్రకటించారు. అంతకు ముందు వర్కర్లను రెచ్చగొట్టి సమ్మెకు ఉసిగొల్పారనే నెపంతో 11 మంది కార్మికులను కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








