మారుతి మానేసర్ ప్లాంటులో కొనసాగుతున్న సమ్మె

యాజమాన్యంతో ఇప్పటికే మూడుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదని కార్మిక వర్గాలు అంటున్నాయి. కాగా.. ఈ నిన్న ఆదివారం సాధారణంగా సెలవు కావడంతో ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. శనివారం సెకండ్ షిఫ్ట్ నుంచి సుమారు 2,000 మంది కార్మికులు సమ్మె ప్రారంభించడంతో దాదాపు 650 యూనిట్లు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్లాంటులో రోజుకు 1,300 యూనిట్లు ఉత్పత్తి అవుతాయి. ఈ సమ్మె కారణంగా సోమవారం ఉదయం 10.04 నిమిషాలకు బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో కంపెనీ షేర్లు 1.36 శాతానికి దిగజారి రూ. 1216.80 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications








