వోల్క్‌వ్యాగన్ నుంచి విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్

పూణేకు చెందిన మరత్వాడ మిత్ర మండల్ పాలిటెక్నిక్ కళాశాల సహకారంతో జర్మనీ కంపెనీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. "వోక్స్‌వ్యాగన్ గ్రూప్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పోగ్రామ్"గా పిలిచే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు శిక్షణ, సాంకేతిక మద్దతు, ఉద్యోగ అవకాశాలు వంటి వాటిని వోక్స్‌వ్యాగన్ అందించనుంది. భారత్‌లో ఇటువంటి అవకాశాన్ని దక్కించుకున్న తొలి విద్యాసంస్థగా మరత్వాడ మిత్ర మండల్ పాలిటెక్నిక్ కళాశాల ఖ్యాతి గడించనుంది. కేవలం పుస్తకాల్లో చదువుకోవడం మాత్రమే కాకుండా.. ప్రత్యక్షంగా వాటికి సంబంధించిన శిక్షణను కూడా కల్పించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
ఐటిఐ కోర్సులలోని మెకానిక్ మోటార్ వెహికల్, డీజిల్ ఇంజన్ మెకానిక్, డిప్లొమా వంటి విభాగాల్లోని విద్యార్థులకు మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ క్రమశిక్షణ గురించి నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చక్కగా ఉపయోగపడుతుంది. విద్యా సంస్థకు దానం చేసిన జెట్టా, పోలో కార్ల తయారీలో కూడా విద్యార్థులకు వోక్స్‌వ్యాగన్ శిక్షణ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








