కాలేజ్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్: లుథియానా ఆర్టీవో నిర్ణయం..!

Driving License
ఒకప్పుడు డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే.. ఏజెంట్లు చుట్టూ, ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఒక్కోసారి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంటే ఐఏఎస్ పరీక్ష మొదటి ర్యాంక్‌లో పాస్ అయినంత కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఆర్టీఓ కార్యాలయమే కాలేజ్‌కు రానుంది. అదెక్కడ అనుకుంటున్నారా.. లుథియానాలో, లుథియానాకు చెందిన జిల్లా రవాణా కార్యాలయం (ఆర్టీఓ) డ్రైవింగ్ లైసెన్సులు కోరుకునే విద్యార్థుల ప్రయోజనార్థం లైసెన్సులను ఆర్టీఓ కార్యాలయాల్లోకాకుండా, వారు చదువుకునే కళాశాలల్లోనే జారీ చేయాలని నిర్ణయించింది.

ఈమేరకు పలు కళాశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశమైన జిల్లా ఆర్టీఓ అధికారి అశ్వానీ కుమారు షరమ్ మాట్లాడుతూ.. లైసెన్సులు జారీ చేసేందుకు ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న కళాశాలల ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు ఇచ్చిందని అలాగే, ప్రైవేట్ కళాశాలలు లైసెన్సుకు కావాల్సిన ఫీజు, పత్రాలను పంపిస్తే తాము లైసెన్సులు పంపిస్తామని తెలిపారు. దీని ఫలితంగా ఆర్టీఓ కార్యాలయాల్లో రద్దీ చాలా వరకూ తగ్గుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల సమయం కూడా వృధా కాదని వారు అంటున్నారు.

Most Read Articles

English summary
Ludhiana District Transport Office (DTO) has decided issue the driving license for students in their own colleges, rather than getting it from the RTO office.
Story first published: Friday, July 8, 2011, 18:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X