పెట్రోల్ ధరలు పెరిగే వరకూ ఎలక్ట్రిక్ కార్ల జోలికి వెళ్లరు: స్టడీ

ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే.. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై తాజాగా జరిపిన అధ్యయనాలు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. డెలాయిట్ టూస్చ్ తోమాస్తు లిమిటెడ్ జరిపిన తాజా అధ్యయనం ప్రకారం, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ అంత సమర్థతవంతంగా లేదని, ఇక్కడ ఏటా కేవలం లక్ష వాహనాలు అమ్ముడవడానికి మాత్రమే అవకాశం ఉందని పేర్కొంది.
పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 85 తాకితేనే భారతీయ వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్లవైపు మళ్లే ఆస్కారం ఉందని, అంతేకాకుండా భారతీయ వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్లను చార్జింగ్ చేసే సమయాన్ని కూడా రెండు గంటలకు తగ్గిస్తే బావుండునని, వీటి రేంజ్ కనీసం 320 కిలోమీటర్ల వరకూ ఉంటే మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఈ అధ్యయనంలో తేలింది.


Click it and Unblock the Notifications








