నిస్సాన్ వృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మైక్రా, సన్నీ

కాగా.. నిస్సాన్ అత్యధికంగా అమ్ముడువుతున్న చిన్న మైక్రా అక్టోబర్ నెలలో కూడా ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచింది. గడచిన నెల మొత్తం అమ్మకాలలో నిస్సాన్ మైక్రానే 1,619 యూనిట్లు అమ్ముడుపోయి 52 శాతం వృద్ధిని కనబరిచింది. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభ్యమవుతుండగా, నిస్సాన్ సన్నీ సెడాన్ మాత్రం ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్‌లోనే లభ్యమవుతుంది. కాగా.. రానున్న సంవత్సరంలో సన్నీలో ఓ డీజిల్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు నిస్సాన్ గతంలో తెలిపింది.
ఇకపోతే మూడు వేరియంట్లలో లభిస్తున్న నిస్సాన్ సన్నీ సెడాన్ లీటరు పెట్రోల్‌కు 16.95 కి.మీ. మైలేజీనిస్తుంది. బ్రాంజ్ గ్రే, బ్లేడ్ సిల్వర్, స్ట్రోమ్ వైట్, సప్ప్‌హైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్, బ్రిక్ రెడ్ అనే ఆరు ఆర్షనీమైన రంగుల్లో కొత్త నిస్సాన్ సన్నీ సెడాన్ లభ్యమవుతుంది. ఇక ధర విషయానికి వస్తే.. ఎంట్రీ-లెవల్ వేరియంట్ నిస్సాన్ సన్నీ ఎక్స్ఈ ధర రూ.5,88,276, మిడ్-లెవల్ వేరియంట్ నిస్సాన్ సన్నీ ఎక్స్ఎల్ ధర రూ.7,00,230, హై-ఎండ్ వేరియంట్ వేరియంట్ నిస్సాన్ సన్నీ ఎక్స్‌వీ ధర రూ.7,81,654 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)లుగా ఉన్నాయి.
ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ వెర్నా ఫ్లూయిడిక్, హోండా సిటీ వంటి మిడ్-సెజ్ సెడాన్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ మూడు వేరియంట్లలోనూ పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ సిస్టమ్‌లు స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా వస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న 45 డీలర్‌షిప్‌ల ద్వారా కొత్త సన్నీ లభ్యమవుతుంది. నిస్సాన్ ఇవే కాకుండా ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ, టియాన్ ప్రీమియం సెడాన్ మరియు 370జెడ్ స్పోర్ట్స్ కార్లను కూడా భారత్‌లో విక్రయిస్తుంది.


Click it and Unblock the Notifications








