సప్లయ్ కొరత.. హోండా జాజ్ బుకింగ్స్ నిలిపివేత

అయితే, థాయ్‌లాండ్‌లో ఇటీవల సంభవించిన వరదల కారణంగా జాజ్ తయారీకి కావాల్సిన విడిభాగాలలో కొరత ఏర్పడటంతో కొత్త జాజ్ బుకింగ్‌లను హోండా తాత్కాలికంగా నిలిపివేసింది. గత మార్చిలో జపాన్ సంభవించిన సునామీ కారణంగా ఏర్పడిన విడిభాగాల కొరత ఇప్పటికీ పూర్తిగా ఓ కొలిక్కి రాలేదు.
దీనికితోడు తాజాగా థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన వరదల విడిభాగాల సమస్య మరింత అధికమైంది. దీనిపై హోండా సియోల్ అధికారి ఒకరు స్పందిస్తూ.. జాజ్‌కు వస్తున్న డిమాండ్ తమను ఆశ్చర్యానికి గురి చేసిందని, జాజ్ ఇన్షియల్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉందని, అందువల్లనే డీలర్లు ఎక్కువగా జాజ్ బుకింగ్‌లను తీసుకోలేకపోతున్నారని చెప్పారు.
ప్రస్తతం హోండా జాజ్ వెయిటింగ్ పీరియడ్ సుమారు ఆరు నెలల వరకూ ఉంటోంది. జాజ్ బుకింగ్స్ గురించి కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ మాట్లాడుతూ.. సరఫరా కొరత కారణంగా జాజ్ బుకింగ్‌లను నిలిపివేశామని, నవంబర్ లేదా డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ పరిస్థితి సర్దుబాటు కాగలదని చెప్పారు.


Click it and Unblock the Notifications








