హైబ్రిడ్ స్విఫ్ట్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన సుజుకి

Hybrid Swift
స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా పెట్రోల్ ఖాలీ అయిపోతే మీరేం చేస్తారు. అదేం ప్రశ్న పెట్రోల్ బంక్‌కు వెళ్లి పెట్రోల్ ఫుల్ చేయించుకోవడమే అంటారా..! నిజమే, అయితే ఈ కొత్త స్విఫ్ట్‌లో వెళ్తున్నప్పుడు పెట్రోల్ ఖాలీ అయిపోనప్పటికీ కంగారుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది హైబ్రిడ్ స్విఫ్ట్ కాబట్టి. ఎందుకంటే, పెట్రోల్‌తోనే కాకుండా బ్యాటరీ పవర్‌తో కూడా నడిచే ఓ హైబ్రిడ్ స్విఫ్ట్ కారును సుజుకి మోటార్ కంపెనీ టోక్యోలో ఆవిష్కరించింది.

సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బాక్‌ మోడల్‌కు మనదేశంలోనే కాకుండా.. ప్రపంచ మార్కెట్లలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సుజుకి మోటార్ కంపెనీ స్విఫ్ట్‌లో ఓ హైబ్రిడ్ వేరియంట్‌ను ఆవిష్కరించింది. పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా కలిగి ఉండటం ఈ హైబ్రిడ్ స్విఫ్ట్ ప్రత్యేకత. ఈ పెట్రోల్ ఇంజన్ బ్యాటరీను ఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఈ హైబ్రిడ్ స్విఫ్ట్ కేవలం బ్యాటరీ పవర్‌తోనే 30 కి.మీ. దూరం వరకూ ప్రయాణిస్తుంది. హైబ్రిడ్ వాహనాలను తయారు చేయడంలో తాము సిద్ధహస్తులమని నిరూపించుకునేందుకు ఈ స్విఫ్ట్ హైబ్రిడ్ కాన్సెప్ట్‌ను రూపొందించామని సుజుకి పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలు తారాజువ్వల్లా నింగికెగుస్తున్న మన లాంటి దేశాలకు ఇలాంటి కార్ల ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి మారుతి సుజుకి ఈ హైబ్రిడ్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియాకు తీసుకువస్తుందా..!?

More from DriveSpark

Article Published On: Friday, November 11, 2011, 11:50 [IST]
English summary
Suzuki Motor has displayed the first hybrid version of the new Swift at the Tokyo Auto show. The Swift concept is powered by electric motors and has a petrol engine that acts as a range extender. The engine does not power the wheels. Instead it charges up the battery. The Swift can be run up to 30 kilometers as a pure electric vehicle before the petrol engine starts replenishing the used up batteries.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+