క్యూ-కాన్సెప్ట్ మైక్రో కారును ఆవిష్కరించిన సుజుకి

ఇదొక ఎలక్ట్రిక్ వాహనం. అతి తక్కువ పార్కింగ్ స్పేస్, ఆకర్షనీయమైన క్యాబిన్‌తో రూపొందించిన క్యూ-కాన్సెప్ట్ మైక్రో కార్ మోటార్‌సైకిల్ కన్నా ఎంతో సౌకర్యవంతమైన ఆప్షన్. నిత్య జీవితంలో షాపింగ్‌కు వెళ్లడానికి, డాక్టర్‌ను సంప్రదించడానికి, పిల్లల్ని తీసుకు వెళ్లడానికి వంటి చిన్న చిన్న దూరాల ప్రయాణికి ఇది చక్కగా సరిపోతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను టోక్యో మోటార్ షోలో కంపెనీ వెల్లడించనుంది.
నిజంగా ఇలాంటి కార్లు కాన్సెప్ట్ రూపంలోనే ఆగిపోకుండా.. ఉత్పత్తి స్థాయికి వస్తే ఎంత బాగుంటుందో కదా.. కాలుష్యం దుమ్మ, ధూళి, పెట్రోల్, డీజిల్ వంటి సమస్యలు లేకుండా ఎంచక్కా హాయిగా ప్రయాణించవచ్చు. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications








