32 కి.మీ. మైలేజినిచ్చే సుజుకి రెజినా పెట్రోల్ కార్..!!

Suzuki-Regina
జపాన్ ఆటో దిగ్గజం సుజుకి ఓ సరికొత్త కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. "రెజినా" అని పిలువబడే ఈ గ్లోబల్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును త్వరలో జరగనున్న టోక్యో మోటార్ షోలో కంపెనీ విడుదల చేయనుంది. సరికొత్త ఏరో డైనమిక్స్ కలిగిన సుజుకి రెజినాలో రెండు యూపిఎస్‌లు ఉంటాయి. ఇది అధిక ఇంధన సామర్థ్యాన్ని (మైలేజ్) కలిగి ఉండి, అత్యల్ప కర్భన వ్యర్థాలను విడుదల చేస్తుంది.

సుజుకి రెజినాను తక్కువ బరువు (730 కేజీలు) ఉండేలా తీర్చిదిద్దారు. పెట్రోల్ ఇంజన్‌తో లభించినున్న సుజుకి రెజినా మైలేజ్ ప్రతి లీటరుకు 32 కి.మీ. ఉండొచ్చని అంచనా. ఇది కిలోమీటరుకు 70 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ (సిఓ2)ను విడుదల చేస్తుంది. రెండు డోర్లు కలిగి ఉండే సుజుకి రెజినాలో నలుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

సుజుకి రెజినా డ్యాష్‌బోర్డ్‌పై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన హై టెక్నాలజీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఆకర్షనీమయైన ఎక్స్‌టీరియర్ డిజైన్, విశాలమైన, వినూత్నమైన ఇంటీరియర్స్ దీని ప్రత్యేకత. మరో రేండేళ్లలో సుజుకి రెజినా ఉత్పత్తి దశకు చేరుకునే ఆస్కారం ఉంది. 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కూడా సుజుకి ఈ కాన్సెప్ట్‌ను ప్రదర్శించవచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, November 14, 2011, 16:58 [IST]
English summary
Japanese auto major Suzuki has unveiled its concept carcalled 'Suzuki Regnia' ahead of Tokyo Motor Show in Japan. It has developed with high fuel efficiency and low emissions. Regnia fuel efficiency is expected to be close to 32 KMPL.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+