కొత్త స్విఫ్ట్ డెలివరీ ఆలస్యంపై ఫేస్‌బుక్‌లో రచ్చ రచ్చ..!

దీంతో కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును బుకింగ్ చేసుకున్న వినియోగదారులు ఫేస్‌బుక్‌లో "మారుతి సుజుకి స్విఫ్ట్" ఫ్యాన్ పేజ్‌లో తన కొత్త స్విఫ్ట్ ఎప్పుడు లభిస్తోందో చెప్పాలంటూ మారుతి సుజుకి నిలదీస్తున్నారు. ఫేస్‌బుక్‌లో మారుతి సుజుకి స్విఫ్ట్‌కు సుమారు రెండు లక్షలకు పైగా అభిమానులు ఉన్నారు. మానేసర్ ప్లాంటులో నెలకొన్న తాజా పరిస్థితితో కొనుగోలుదారులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్లాంటులో కొందరు కార్మికులు కావాలనే ఉత్పత్తుల నాణ్యతను దెబ్బతీస్తూ కంపెనీ ఆస్తులకు, పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని, సత్ ప్రవర్తనతో ఉంటామనే బాండ్ (గుడ్ కండక్ట్ బాండ్)పై సంతకం చేస్తేనే ప్లాంటులోనికి అనుమతిస్తామని మారుతి యాజమాన్యం పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో కొందురు కార్మికులు మాత్రమే ఈ బాండుపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొంత మంది కాంట్రాక్ట్ వర్కర్ల సాయంతో మారుతి పాక్షికంగా ఉత్పత్తిని ప్రారంభించింది.


Click it and Unblock the Notifications








