పాతికేళ్లు పూర్తి చేసుకున్న టాటా 407 ఎల్‌సివి

టాటా మోటార్స్ తొలిసారిగా 1986 407 ఎల్‌సివిని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఎల్‌సివి 25 వసంతాలను పూర్తి చేసుకుని, ఇప్పటికీ ఎల్‌సివి విభాగంలో దూసుకుపోతుంది. ఈ విభాగంలో అమ్ముడవుతున్న ప్రతి పది కార్లలో ఏడు టాటా 407 ఫ్యామిలీ నుండి అమ్ముడవుతున్నాయంటే వీటికి ఉన్న ఆదరణ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.
డీజిల్, సిఎన్‌జి వేరియంట్లలో లభ్యమయ్యే 407 వాణిజ్య ట్రక్కులు 2.2 టన్నుల పేలోడ్ సామర్థ్యం నుంచి 4.2 టన్నుల పేలోడ్ సామర్థ్యం వరకూ లభిస్తాయి. వీటిల్లో ట్రక్కులు, టిప్పర్లు, పికప్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫ్లాట్‌ఫామ్‌పై 12-24 సీట్లు కలిగిన మినీ బస్సులు కూడా ఉన్నాయి. మరి టాటా మోటార్స్ బ్రాండా మాజాకా..!!


Click it and Unblock the Notifications








