టాటా ఆరియా ప్రత్యేకతలు, విశిష్టతలు మరియు ధరలు

Tata Aria
అటు మల్టీ యుటిలిటీ, ఇటు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంగా ఉపయోగపడే సరికొత్త కారును "టాటా ఆరియా"ను ఇటీవల టాటా మోటార్స్‌ మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో భారత్‌లోని ఇంజనీర్లు రూపొందించి ఈ కారు విశాషాలు ప్రత్యేకతలు ఒక్కసారి పరిశీలిద్దామా..!

టాటా ఆరియా 140 పిఎస్‌ పవర్‌, 320 ఎన్‌ఎం టార్క్‌, 2.2 లీటర్ల డీజల్‌, 2179 సీసీ సామర్ధ్యంతో కూడిన ఇంజన్‌ ఉంటుంది. ఈ ప్రీమియం విభాగపు కారులో థియేటర్‌ శైలిలో అమర్చబడిన మూడు వరసల సీట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రమాదాల నుండి రక్షించేందుకు ప్రతివైపు నుంచి ఆరు ఎయిర్‌ బ్యాగులతో, అత్యాధునిక జీపిఎస్‌ ఆధారిత నేవిగేషన్‌ సిస్టమ్‌, ఆటోమేటిక్ డార్క్‌నెస్‌ సెన్సింగ్‌ లైట్స్‌, రైన్ సెన్సింగ్ వైపర్స్, స్టీరింగ్‌ మౌంటెడ్‌ ఫోన్‌, మ్యూజిక్‌ కంట్రోల్స్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌లు ఇందులో అదనపు ప్రత్యేకతలు.

అంతేకాకుండా.. అత్యవసర పరిస్థితులలో బ్రేకుల వాడినప్పుడు ఇబ్బందులు కలగకుండా ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)‌, ఈబిడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) సిస్టమ్‌ వంటి ప్రత్యేకతలు ఈ కారు సొంతం. ఇంకా తాళంచెవి లేకుండా ఎవరైనా ఈ కారు డోరును తెరవాలని ప్రయత్నిస్తే.. కుయ్య్.. కుయ్య్.. ముంటూ అలారం మోగుతుంది. ఈ టాటా ఆరియా 'ప్రైడ్'‌, 'ప్రిస్టేజ్‌', 'ప్లెజర్‌' అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఒక్కో వేరియంట్ కారు ఎనిమిది రంగులలో అందుబాటులో ఉంది.

ఇంజన్:
ఇంజన్‌ టైప్ - 2.2 L DICOR, BS IV
ఇంజన్‌ సీసీ - 2179 cc
గరిష్ట పవర్ - 140 PS @ 4000 RPM
గరిష్ట టార్క్ - 320 NM @ 1700-2700 RPM

కొలతలు:
మొత్తం పొడవు - 4780 mm
మొత్తం వెడల్పు - 1895 mm
మొత్తం ఎత్తు - 1780 mm
వీల్‌బేసే - 2850 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 200 mm
బరువు - 2720 Kg
సీటింగ్ కెపాసిటీ - 7 Persons
టర్నింగ్ రేడియస్ 5.6 m

సస్పెన్షన్ & బ్రేక్స్:
డ్రైవింగ్ సిస్టమ్ - 4 వీల్ డ్రైవ్
ముందు సస్పెన్షన్ - ఇండిపెండెంట్ డబుల్ విష్‌బోన్ విత్ కాయిల్ స్పింగ్
వెనుక సస్పెన్షన్ - 5 లింక్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్పింగ్
స్టీరింగ్ టైప్ - పవర్ స్టీర్గ్
ముందు బ్రేక్ - డిస్క్ బ్రేక్స్
వెనుక బ్రేక్ - డిస్క్ బ్రేక్స్
టైర్స్ - 235/65 R 17
ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 60 లీటర్లు

లభించే రంగులు:
* సార్డినియా రెడ్
* నైట్-షేడ్ బ్లాక్
* క్యాస్టల్ గ్రే
* క్వార్ట్‌జ్ బ్లాక్
* వాల్‌నట్ గోల్డ్
* పెరల్ వైట్
* ఆర్కిటిక్ సిల్వర్
* సర్ఫ్ బ్లూ

ధరలు:
ప్లెజర్ 4x4 బిఎస్-4 బ్లాక్ & బీగ్, ఫ్యాబ్రిక్ - Rs 13,10,619

ప్రెస్టీజ్ 4x4 బిఎస్-4 బ్లాక్ & బీగ్, ఫ్యాబ్రిక్ - రూ. 14,34,887
బ్లాక్ & ప్లమ్, లెథర్ - రూ. 14,72,544
బ్లాక్ & బ్లాక్, లెథర్ - రూ. 14,72,544

ప్రైడ్ 4x4 బిఎస్-4 బ్లాక్ & ప్లమ్, లెథర్ - రూ. 15,74,320
బ్లాక్ & బ్లాక్, లెథర్ - రూ. 15,74,320

(గమనిక: పైన తెలిపిన అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ హైదరాబాద్, డీలరును బట్టి ధరలు మారవచ్చు)

More from DriveSpark

Article Published On: Wednesday, February 23, 2011, 15:28 [IST]
English summary
he all new Tata Aria by Tata Motors is designed to give you an excellent driving experience on and off the road, it is equipped with extensive safety features that provide you with the highest level of protection. Here is the few information of Tata Aria features and technical specifications.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+