భారత్‌లో మరిన్ని జేఎల్ఆర్ ఉత్పత్తుల అసెంబ్లింగ్: టాటా

గడచిన మే నెలలో భారత్‌లో జేఎల్ఆర్ తమ తొలి అసెంబ్లింగ్ ప్లాంటును పూణేలో ప్రారంభించింది. ఈ ప్లాంటులో కంపెనీ అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ల్యాండ్ రోవర్ 'ఫ్రీల్యాండర్ 2'ను సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) యూనిట్లుగా బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో ఉన్న హాలేవుడ్ ఉత్పత్తి కేంద్రం నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తుంది. (విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో అసెంబ్లింగ్ చేయడాన్ని సికెడి బిజినెస్ అంటారు). "కంపెనీకు ముఖ్యమైన మార్కెట్‌గా ఎదుగుతున్న చైనాలో కూడా ఎంపిక చేసిన ఉత్పత్తులను అసెంబ్లింగ్ మరియు లోకలైజేషన్‌కు సంబంధించిన వివిధ మార్గాలను టాటా మోటార్స్ పరిశీలిస్తోంద"ని రతన్ టాటా చెప్పారు.


Click it and Unblock the Notifications








