టాటా చౌక ఆరియా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయట!

భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) గణాంకాల ప్రకారం, టాటా మోటార్స్ యొక్క ఆరియా మరియు జెనాన్ మోడళ్ల ఏప్రిల్ మరియు మే నెల దేశీయ విక్రయాలు భారీగా తగ్గి మొత్తం 343 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరియా బ్రాండ్‌కు పునఃజీవం పోసేందుకు, ఈ బ్రాండ్‌లో చౌక ధరకే ఓ మోడల్‌ను విడుదస చేయాలని కంపెనీ భావిస్తోంది. టాటా ఆరియా గతేడాది అక్టోబర్ నెలలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. 36 విశిష్టమైన ఫీచర్లతో టొయోటా ఫ్యార్చ్యూనర్, హోండా సిఆర్‌విలకు పోటీ ఇచ్చేందుకు టాటా మోటార్స్ ఈ క్రాసోవర్ కారును విడుదల చేసింది. అయితే, టాటా మోటార్స్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.


Click it and Unblock the Notifications








