సింగూర్ బిల్లును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన టాటా

జూన్ 14వ తేదీన సింగూర్ బిల్లును మమత పాస్ చేశారు. ఆ వెంటనే పశ్చిమా బెంగాళ్ గవర్నర్ కూడా ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ భూములకి సంబంధించి సింగూర్ ల్యాండ్ రిహాబిలేషన్ అండ్ డెవలప్‌మెంట్ బిల్ 2011 ప్రకారం.. సింగూర్‌లోని నానో కారు ప్లాంటును టాటా మోటార్స్ అభివృద్ధి చేయడం లేదని, ఆ ప్రాజెక్టును నిలిపివేసిందని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందని బెంగాళ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే బిల్ పాస్ అయిన రోజునే టాటా మోటార్స్ టాటా మోటార్స్ కూడా తాము చేసిన అభివృద్ధి కార్యకలాపాల గురించి ప్రజలకు వివరించింది.
తాజాగా.. సింగూర్ బిల్లు వివాదం మరో మలుపు తిరగింది. పశ్చిమ బెంగాల్ ఆమోదించిన సింగూర్ బిల్లును సవాల్ చేస్తూ మంగళవారం టాటా మోటార్స్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మమతకు టాటాకు మధ్య వైరం మరింత రాజుకున్నట్లయింది.


Click it and Unblock the Notifications








