టాటా డిలైట్ లక్కీ డ్రాలో 'నానో' గెలుపొందిన తొలి విజేత

టాటా డిలైట్ ప్రోగ్రామ్‌కు ఎన్‌రోల్ చేసుకున్న ఇతర సభ్యులు కూడా ఈ విధంగానే టాటా నానో కారును లక్కీ డ్రాలో గెలుచుకోవచ్చునని కంపెనీ తెలిపింది. ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఈ లక్కీ డ్రాను తీయడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా టాటా వాణిజ్య వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు వివిధ రకాల సేవలపై సబ్సిడీలు అందించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లు, సేల్స్ అవుట్‌లెట్లు, ఆథరైజ్డ్ సర్వీస్ స్టేషన్లలో వినియోగదారులు ఈ సేవలను పొందవచ్చు.
ఈ స్కీమ్‌లో భాగంగా వాణిజ్య కొనుగోలు చేసే వినియోగదారులకు బోనస్ పాయింట్లను ఇవ్వడం జరుగుతుంది. డీలర్‌షిప్స్, సేల్స్ అవుట్‌లెట్స్, సర్వీసింగ్ సెంటర్లలో వాహనాల మరమ్మత్తులు, విడిభాగాల కొనుగోళ్ళపై కూడా బోనస్ పాయింట్లు లభిస్తాయి. అంతేకాకుండా టాటా మోటార్స్ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు, పిల్లకు ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్స్ టాటా డిలైట్ ద్వారా పొందవచ్చు. టాటా డిలైట్‌లో సభ్యత్వం తీసుకున్న వారికి మూడు లక్షల రూపాయల వరకూ బీమా కవరేజ్ ఉంటుంది. టాటా డిలైట్ సభ్యత్వంను కేవలం రూ. 100 (ఇన్సూరెన్స్ లేకుండా) మరియు రూ. 500 (ఇన్సూరెన్స్‌తో కలిపి)కే అందిస్తున్నట్లు గతంలో కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








