గాలితో నడిచే కారును అభివృద్ధి చేస్తున్న టాటా మోటార్స్

ఇప్పటికే నీటితో నడిచే కారును అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న టాటా మోటార్స్, ఇప్పుడు గాలితో నడిచే కారును కారును అభివృద్ధి చేస్తుంది. కంప్రెస్డ్ ఎయిర్‌తో నడిచే 'మినీక్యాట్' అనే కారును టాటా మోటార్స్ అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే కంపెనీ ఈ 'గాలి' కారును ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉంది. ఇదే గనుక జరిగితే టాటా మినీ క్యాట్ తొలి కమర్షియల్ ఎయిర్-పవర్డ్ వాహనంగా రికార్డు సృష్టించనుంది.
లక్సెంబర్గ్‌లోని ఫార్ములా వన్ ఇంజనీర్ 'గయ్ నిగర్' ఈ కారును అభివృద్ధి చేశారు. టాటా మీనీక్యాట్ ధర దాదాపు 8,117 డాలర్లుగా ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.4 లక్షల అన్నమాట. భారత మార్కెట్లో త్వరలో దాదాపు 6,000 ఎయిర్ కార్లను టాటా మోటార్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కారులో ఓ ఎయిర్ ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. ఒక పూర్తి ఎయిర్‌ట్యాంక్‌తో సుమారు 300 కి.మీ. ప్రయాణించవచ్చట.
ఈ కారు తక్కువ బరువు ఉన్న కారణంగా ఇంత రేంజ్ ప్రయాణించగలదు. కారు బరువును తగ్గించేందుకు గానూ దీన్ని ఫైబర్ గ్లాస్ వంటి తేలికపాటి పధార్థాలతో నిర్మించారు. ఈ కారులో 100 కి.మీ ప్రయాణానికి గానూ అయ్యే ఖర్చు రూ.50 లోపే ఉంటుందట. మరి ఇది వాణిజ్య పరంగా మన మార్కెట్లోకి విడుదలవుతుందో లేదా టాటా మోటార్సే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications