ఆసియా దేశాలకు పయనం కానున్న టాటా నానో

Tata Nano
ప్రపంచంలోనే అతి చవకైన కారు (నానో)ను తయారు చేసి రికార్డు సృష్టించి టాటా మోటార్స్ ఇప్పుడు ఆ కారును విక్రయించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. నానోను తయారుచేసే సమయంలో నానో ధర కన్నా తక్కువుగా ఉండే కార్లు మార్కెట్లో లేవు. పైగా అప్పట్లో చిన్నకార్ల మార్కెట్ కూడా పెద్దగా వృద్ధి చెందకపోవడంతో నానోకు మంచి గిరాకీ ఏర్పడింది. కానీ ఈ రెండేళ్లలో దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో చోటుచేసుకున్న మార్పులతో నానో అంటే 'నో' అనేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది.

ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఓ వైపు బజాజ్-రీనాల్ట్‌లు కలిసి నానో కన్నా తక్కువ ధర ఉండేలా చిన్నకారును రూపొందిస్తున్నాయి. మరోవైపు హోండా, హ్యుందాయ్ వంటి పలు కంపెనీలు చిన్నకార్లలో కొత్త మోడళ్లను ప్రవేశ పెట్టడం, మరికొన్ని విదేశీ సంస్థలు చిన్నకారు విడుదలకు సంబంధించి ప్రకటనలు చేయడంతో ఈ విభాగంలో గట్టి పోటీ నెలకొంది. ఈ పోటీ నడుమ నానో తన స్థానాన్ని నిలుపుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. నానో కారు డెలివరీలో జాప్యం జరగకుండా ఉండేందుకు ఓపెన్ సేల్స్, వారంటీ పెంపు వంటి వినూత్న ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా.. టాటా మోటార్స్ నానో విక్రయాలను పెంచుకునేందుకు ఆసియా డ్రైవ్‌ను చేపట్టింది. 2010 చివరి నెలల్లో నానో విక్రయాలు ఊహించని రీతిలో పడిపోవడంతో కంపెనీ వినూత్న ప్రచారానికి తెరలేపింది. నానో విక్రయాల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎగుమతులే శరణ్యమని టాటా భావిస్తోంది. నానో కారును ఎగుమతులకు శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌ వంటి దేశాలను టాటా గుర్తించింది. ప్రస్తుతం సగటున నెలకు 6,000 నుండి 7,000 యూనిట్లు అమ్ముడుతున్నాయని, త్వరలోనే ఇవి 8,000 నుండి 10,000 యూనిట్లకు పెరగుతాయని కంపెనీ సీఈఓ ఆశాభావం వ్యక్తం చేశారు. వినియోగదారులకు 100 శాతం రుణ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఈ విక్రయాలను సాధించగలమని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, January 31, 2011, 12:40 [IST]
English summary
With the ebb and low success of Nano hitting rocks to the camps of Tata Motors, the company now wants to drive in this world cheapest car to the regions of Asia. Tata is badly in need of sales promotion of this two year old car which has seen the fall during the fag months of 2010. Tata now feels that the export will be the ideal potential to compensate the targeted sale volume.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+