మారుతి సుజుకి బాటలోనే టాటా మోటార్స్..

Ratan Tata
మార్కెట్ మందగమనం కారణంగా జులై నెలలో దేశీయ అగ్రగామి ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ప్రతిపాదిత ఉత్పత్తి సామర్థ్యం కంటే తక్కువగా ఉత్పత్తిని కుదించుకుంటున్నాయి. ఇప్పటికే దేశీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి స్విఫ్ట్, డిజైర్ మోడళ్లు మినహా ఆల్టోతో సహా మిగిలిన అన్న మోడళ్ల ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా.. మరో అగ్రగామి ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా మారుతి సుజుకి బాటలోనే ఉత్పత్తి తగ్గింపుకు మొగ్గు చూపుతోంది.

గడచిన జులై నెలలో టాటా మోటార్స్ దేశీయ మరియు అంతర్జాతీయ అమ్మకాలు మందగించటమే ఇందుకు ప్రధాన కారణం. జులై 2011లో టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలు 47 శాతం క్షీణించగా, అంతర్జాతీయ అమ్మకాలు 6 శాతం క్షీణించాయి. దీంతో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వాహనాలను ఉత్పత్తి చేస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు అన్నారు. జూలై ఉత్పత్తిలో 27 శాతం కోత విధించామని, ప్రస్తుతం మార్కెట్ చాలా మందకొడిగా సాగుతోందని ఆయన అన్నారు.

జులై నెలలో విదేశీ మార్కెట్లలో టాటా మోటార్స్ మొత్తం 85,392 యూనిట్లను (జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో కలిపి) విక్రయించింది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నాటికి (ఏప్రిల్-జులై 2011) కంపెనీ మొత్తం విదేశీ విక్రయాలు 350,565 యూనిట్లుగా ఉన్నాయి. జులై నెలలో అన్ని గ్లోబల్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 24 శాతం తగ్గగా, గ్లోబల్ వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం 16 శాతం పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 17, 2011, 10:40 [IST]
English summary
The Tata Motors Group global wholesales, including Jaguar Land Rover, were 85,392 nos., in July 2011, lower by 6% over July 2010. Cumulative sales for the fiscal are 350,565 higher by 4% compared to the corresponding period in 2010-11.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+