అనంతపురానికి విచ్చేసిన బంగారు టాటా నానో

గత నెలలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఈ బంగారు నానో (గోల్డెన్ నానో) ఆవిష్కరించారు. టాటా గ్రూపులోని స్వర్ణాభరణాల విభాగం అయిన 'టాటా గోల్డ్ ప్లస్' కంపెనీ ప్రచారంలో భాగంగా ఈ బంగారు నానో కారును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గోల్డ్ ప్లస్ అవుట్‌లెట్లలో ఈ కారును ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇందులో భాగంగానే కంపెనీ తమ బంగారు నానో కారును అనంతపురం జిల్లాలో కూడా ప్రదర్శనకు ఉంచింది.
గోల్డ్ నానో తయారీ కోసం 80 కేజీల స్వచ్ఛమైన బంగారాన్ని, 15 కేజీల వెండిని మరియు 10,000 రత్నాలను ఉపయోగించారు. ఈ బంగారు నానో కారు తయారీకి కంపెనీ సుమారు రూ.22 కోట్లకు పైగా ఖర్చు చేసింది.


Click it and Unblock the Notifications








