టాటా గ్రూపు ఉద్యోగులకు టాటా నానోపై స్పెషల్ డీల్స్

Tata Nano
ప్రపంచంలోనే అత్యంత చౌక కారుగా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రజల కారు 'టాటా నానో' విక్రయాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం టాటా నానో సాధారణ కొనుగోలుదారుల కోసం ఈ కారుపై నగదు డిస్కౌంట్లను మరియు డౌన్‌ పేమెంట్ తగ్గింపును ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా టాటా గ్రూపు అధీనంలో ఉన్న వివిధ కంపెనీలు / సంస్థలలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు టాటా నానో కారుపై టాటా మోటార్స్ ప్రత్యేక పథకాలను అందించనుంది. భారత్‌లో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థగా అవతరించిన టాటా గ్రూపు ఉప్పు నుంచి ఐటి వరకూ వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న టాటా గ్రూపు, తమ సంస్థలలో పనిచేసే వారికి ఈ బుజ్జి కారుపై స్పెషల్ డీల్స్‌ను అందిచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ తరహా పథకాన్ని టాటా గ్రూపుకు చెందిన కీలక ఐటి విభాగం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టిసిఎస్)లో కంపెనీ అమలు చేసింది.

టిసిఎస్ ఉద్యోగులకు టాటా నానో కారుపై ప్రత్యేక తగ్గింపులు, తక్కువ వడ్డీ రేట్లు, ఈఎమ్ఐ స్కీమ్స్ వంటి వివిధ ఆఫర్లను ప్రకటించింది. పది రోజుల పాటు ప్రకటించిన ఈ ఆఫర్లకు టిసిఎస్ ఉద్యోగుల నుంచి ఆశేష ఆదరణ లభించిందని కంపెనీ పేర్కొంది. టిసిఎస్ ఉద్యోగులకు అందజేసిన టాటా నానో స్పెషల్ ఎడిషన్ వెర్షన్ కారును "టిసిఎస్ నానో" అని పిలుస్తారు.

ఈ స్పెషల్ ఎడిషన్ టిసిఎస్ నానో కారు ఇంటీరియర్‌లోని డ్యాష్‌బోర్డ్‌పై టాటా గ్రూపు సంస్థల చైర్మన్ రతన్ టాటా సంతకం కూడా ఉంటుంది. త్వరలోనే ఈ తరహా పథకాన్ని టాటా గ్రూపు ఉక్కు విభాగమైన టాటా స్టీల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు మరియ ఇతర అనుబంధ సంస్థలలో పనిచేస్తున్న వారికి వర్తింపచేయాలని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, August 26, 2011, 13:06 [IST]
English summary
Tata Motors has launched a special promotional scheme for its Nano small car aimed specifically at Tata Group Employees. The Tata Group is one India's highest private sector employers with 2 lakh employees and operates in several fields of business. With the sales of the Nano taking a severe beating in the past few months, Tata Motors is looking internally for buyers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+