ప్రత్యామ్నాయ ఇంధన పరిశోధనపై టాటా గ్రూపు ప్రయోగాలు

Ratan Tata
శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేటి రోజుల్లో భవిష్యత్తులో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంధనానికి బదులుగా ఉపయోగించే ప్రత్యమ్నాయ ఇంధనాల (సౌర విద్యుత్, బయోడీజిల్, ఇధనాల్) వెతకడంపై పలు కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ మేరకు భారత్‌లో వివిధ రంగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న రతన్ టాటాకు చెందిన "టాటా గ్రూపు" తాజాగా ప్రత్యామ్నయ ఇంధనంపై రీసెర్చ్, క్లినికల్‌ డయోగ్నాస్టిక్‌ రంగంలో ప్రవేశించిలను బావిస్తుందని టాటా ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ ఏ చౌకర్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా తొలుత టాటా గ్రూపు ఓ రీసెర్చ్ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌ అండ్‌ డి) విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.

అయితే ఇందుకు సంబంధించి మరిన్న వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ప్రంపంచంలోనే అత్యంత చౌకధరకే టాటా నానో కారును ప్రవేశపెట్టిన రతన్ టాటా, నీటితో నడిచే ఓ కారును రూపొందింటడం తాను కంటున్న కల అని ఒకానొక సందర్భంలో సంకేతమాత్రంగా చెప్పడం జరిగింది. ఈ మేరకు అమెరికాలోని మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ వాటర్ కార్‌ను రూపోందిస్తోంది. ఇందుకు గానూ రతన్ టాటా 1.50 కోట్ల అమెరికా డాలర్లను పెట్టుబడిగా వెచ్చించినట్లు సమాచారం. నీటిలో ఉండే హైడ్రోజన్, ఆక్సిజన్‌లను విడగొట్టడం ద్వారా వచ్చే శక్తితో కారు నడిచేలా రూపకల్పన చేస్తున్నారు.

Article Published On: Monday, May 23, 2011, 14:06 [IST]
English summary
The salt-to-software Tata Group is keen to make a foray into newer technology-driven businesses such as alternative energy research and clinical diagnostics , a top executive has said. To begin with, the $72-billion Group is keenly looking at launching a dedicated R&D company on the alternative energy front.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+