లీటరుకు 45.2 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇచ్చిన ఇండికా ఈవీ2

కాగా.. రెండు వారాల క్రితం ఇదే కార్యక్రమాన్ని టాటా మోటార్స్ చెన్నయ్‌లో కూడా నిర్వహించింది. ఈ పోటీలో 65 సభ్యులు పాల్గొనగా వారిలో 40 మంది లీటరుకు 20-30 కి.మీ. మైలేజ్‌ను, 25 మంది లీటరుకు 30-46 కి.మీ. మైలేజ్‌ను నమోదు చేశారు. కాగా.. జి. సతీష్ కుమార్ అనే పార్టిసిపెంట్ అత్యధికంగా 45.8 కిలోమీటర్ల మైలేజ్‌ను తీసుకువచ్చి ప్రథమ స్థానాన్ని చేజిక్కుచుకోగా, 42.5 కి.మీ. మైలేజ్‌తో రుద్రకుమార్ ద్వితీయ స్థానంలోనూ, 41.49 కిలోమీటర్ల మైలేజ్‌తో శక్తి తృతీయ స్థానంలోనూ నిలిచారు. కాగా.. ముగ్గురు విజేతలకు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులకు గానూ రూ. 25,000, రూ. 15,000 మరియు రూ. 10,000 విలువ చేసే గిఫ్ట్ వోచర్లను అందజేశారు.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన ఇండికా ఈవీ2 కారు భారతదేశంలో అత్యధిక మైలేజ్‌నిచ్చే కారని కంపెనీ పేర్కొంది. ఇండికా ఈవీ2 లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ అందిస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ కారు గురించిన మరింత సమాచారం మీ కోసం...!
ఇండికా ఈవీ2 కారు ఫీచర్స్ అండ్ ప్రైస్ మీ కోసం...
* ఇంధనంపై కిలోమీటరకు అయ్యే ఖర్చు కేవలం రూ. 1.60 మాత్రమే.
* ఇందులో సిఆర్4 ఇంజన్‌ను వాడటం వల్ల ఇది 32% అధిక శక్తి (70 పిఎస్), 65% అధిక టార్క్ (162 ఎన్ఎమ్)ను కలిగి ఉంటుంది.
* దీని 60:40 ఫ్లిప్-ఫ్లాప్ సీటింగ్, విశాలమైన లెగ్‌రూమ్ మరియు షోల్డర్ రూమ్‌లను కలిగి ఉంటుంది.
* ఆటో డ్రైవ్ అసిస్ట్ ఉండటం వల్ల ఏటవాలు రోడ్లపై సైతం సునాయసంగా ప్రయాణిస్తూ.. క్లచ్ ప్లేట్ బర్నింగ్‌ను దూరం చేస్తుంది.
* క్లచ్-టు-స్టార్ట్ ఉండటం ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ జామ్‌లలో ఎక్కువ సేపు ఇంజన్ ఆన్‌లో ఉంచకుండా ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి.. మరళా క్లచ్ నొక్కిన వెంటనే ఇంజన్ స్టార్ అయ్యే సదుపాయం. దీనివల్ల ఇంధనం కూడా ఆదా అవుతుంది.
* లార్జ్ బ్రేక్ బూస్టర్ కలిగిన ఆర్ 14 టైర్స్ విత్ అల్లాయ్ వీల్స్.
* సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్ విత్ బ్లూటూత్, ఫాగ్ ల్యాంప్స్.
* ఆకర్షనీయమైన ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్.
* రెండేళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వారెంటీ.
ధరలు:
ఇండికా ఈవీ2 ఎల్ - రూ. 3,96,205 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)
ఇండికా ఈవీ2 ఎల్ఈ - రూ. 4,35,231 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)
ఇండికా ఈవీ2 ఎల్ఎస్ - రూ. 4,52,871 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)
ఇండికా ఈవీ2 ఎల్ఎక్స్ - రూ. 4,81,646 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)


Click it and Unblock the Notifications








