టాటా ఇండికాలో మరో అప్‌గ్రేడెడ్ వేరియంట్!

Tata Indica Vista
టాటా మోటార్స్ అందిస్తున్న కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న 'టాటా ఇండికా' హ్యాచ్‌బ్యాక్ మరోసారి అప్‌గ్రేడ్ కానుంది. ప్రస్తుతం టాటా ఇండికా కారును ఎక్కువగా టాక్సీలు మరియు కమర్షియల్ ప్యాసింజర్ వాహనంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దేశీయ వినియోగదాలు తమ గృహ అవసరాల కోసం కూడా ఈ కారును ఉపయోగించుకునే విధంగా సరికొత్త ఇండికా కారును టాటా మోటార్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ కారును టాటా మోటార్స్ ట్రైల్ రన్ కూడా నిర్వహిస్తోంది. కొత్త టాటా ఇండికా కారు యొక్క హెడ్‌ల్యాంప్స్ మరియ గ్రిల్ కొంచెం పెద్దవిగా ఉండి దాదాపుగా ఇండిగో మాంజా సెడాన్‌ను పోలి ఉంటాయి. కొత్త ఇండికా వెనకు బంపర్‌ కూడా అప్‌గ్రేడ్ చేయబడింది. మాంజా‌లోని చాలా ఫీచర్లు కొత్త ఇండికాలో ఉండే అవకాశం ఉంది. కొత్త ఇండికా ఇంటీరియర్స్‌ను అధిక నాణ్యత కలిగి ఉండనున్నాయి.

అయితే, ఇంజన్ మరియు ట్రాన్సిమిషన్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. కొత్త ఇండికా కోసం రీడిజైన్ చేసిన వెనుక బంపర్ కారణంగా ప్రస్తుతం ఉన్న ఇండికా కారు కన్నా ఇది కాస్తంత పొడవుగా కనిపించనుంది. ఇక ధర విషయానికి వస్తే.. కొత్త ఇండికాలో లభ్యమయ్యే అధిక ఫీచర్ల కారణంగా ప్రస్తుత ఇండికా వేరియంట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాటా ఇండికా కారు ధర రూ. 3.38 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, August 8, 2011, 12:27 [IST]
English summary
Tata Motors has once again decided to provide the Indica hatchback with a facelift. The Indica has been one of Tata's highest selling model in recent years and it has get several face lifts. The Tata Indica has mostly been used as a taxi or a commercial passenger vehicle. Tata Motors now wants to draw the focus of domestic consumers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+