లీటరుకు 46.33 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చిన టాటా మాంజా

Tata Manza
టాటా మోటార్స్ అందిస్తున్న సెడాన్ వేరియంట్ కారు 'టాటా మాంజా' ఆశ్చర్యపోయే మైలేజ్‌ను ఇచ్చింది. కొయంబత్తూర్‌కు చెందిన నారాయణన్ మెనాన్ అనే ఓ వ్యాపారవేత్త టాటా మాంజాతో అద్భుతమైన మైలేజ్‌ను సాధించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించారు. ఆరోమెన్ ఇంజనీరింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నారాయణన్ ఆర్ మెనాన్ తన టాటా మాంజా (క్వాడ్రాజెట్ ఔరా ఏబిఎస్) కారుతో లీటరుకు 46.33 కిలోమీటర్ల మైలేజ్‌ను సాధించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ప్రవేశించినట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

గత 25-05-2011న కొయంబత్తూర్-అవినాషి బైపాస్ రోడ్డుపై కేవలం 1.58 లీటర్ల డీజిల్‌తో మెనాన్ 72.3 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించారు. మెకానికల్ ఇంజనీర్ అయిన మెనాన్ దీనిపై స్పందిస్తూ ఇందులో మ్యాజిక్ ఏమీ లేదని మంచి డ్రైవింగ్‌తో పాటును కారును ఎప్పటికప్పుడు సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే చాలని చెప్పారు. ఇంధన ధరలు నానాటికీ పెరుగుతున్న మనలాంటి దేశాల్లో ఇలాంటి ఫీట్లు సాధించడం అరుదైన విషయమే. లిమ్కా బుక్ రికార్డు సాధించిన నారాయణన్ మెనాన్‌కు మనం కూడా అభినందనలు తెలుపుదాం.

More from DriveSpark

Article Published On: Tuesday, June 7, 2011, 9:51 [IST]
English summary
The Tata Manza (Quadrajet Aura ABS) has clogged an incredible mileage of 46.33 km per litre. This feat has been achieved by Mr. Narayanan Menon, a resident of Coimbatore who has zoomed into the the Limca Book of Records.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+