తొలిసారిగా 10,000 యూనిట్లను దాటిన టాటా నానో విక్రయాలు

Tata Nano
టాటా మోటార్స్ ముద్దుల కారు నానో మరోసారి రికార్డులు బద్దలు కొట్టింది. ప్రజల కారుగా ప్రవేశపెట్టిన నానోపై వస్తున్న అనుమాలు మెల్లి మెల్లిగా తొలగిపోతుండటంతో ఈ కారుకు అత్యంత ప్రజాదరణ లభిస్తోంది. గతేడాది నవంబర్ నెలలో కేవలం 500కు పైగా మాత్రమే అమ్ముడైన నానో కార్లు ఇప్పుడు ఏకంగా ఒక్క నెలలోనే 10,000కు పైగా అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 2011లో 10 వేల నానో కార్లు విక్రయించినట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఒకే నెలలో ఇంత పెద్ద మొత్తంలో అమ్మకాలు జరగడం ఇదే మొట్టమొదటిసారి అని కంపెనీ పేర్కొంది.

అంటే గతేడాది ఇదే నెలతో పోలిస్తే నానో కార్ల విక్రయాలు 184 శాతం వృద్ధిని సాధించాయి. కాగా.. టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు ఏప్రిల్ నెలలో 13 శాతం వృద్ధి కనబరిచాయి. ఏప్రిల్ 2010తో పోలిస్తే.. ఏప్రిల్ 2011లో కంపెనీ మొత్తం విక్రయాలు 57,199 యూనిట్ల నుంచి 64,383 యూనిట్లకు పెరిగాయి. అయితే ప్యాసింజర్ వాహన విక్రయాల్లో 1.24 శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసుకుని గతేడాదితో పోలిస్తే విక్రయాలు 23,099 యూనిట్ల నుంచి 23,387 యూనిట్లకు పెరిగాయి. వీటిలో 10,012 నానో కార్లే ఉండటం విశేషం.

More from DriveSpark

Article Published On: Monday, May 2, 2011, 10:24 [IST]
English summary
Tata Motors announced a 13 per cent jump in total sales in April, 2011 from 57,199 to 64,383 units in the same month last year, riding on good numbers from small car Nano, which crossed the 10,000 mark for the first time.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+