దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ జొక్‌పాట్ కొట్టింది. దాదాపు 150 కోట్ల రూపాయల విలువ కలిగిన ట్రక్కుల సప్లై ఆర్డర్‌ను టాటా మోటార్స్ సొంతం చేసుకుంది. సూరత్‌కు చెందిన సిద్ధివినాయక లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎస్‌వీఎల్ఎల్) కంపెనీ నుంచి 1,111 మీడియం, హెవీ ట్రక్కుల ఆర్డర్‌ను పొందినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈనెల నుంచే డెలివరీలను ప్రారంభిస్తామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఈ ఆర్డర్‌ను పూర్తి చేస్తామని టాటా మోటార్స్ హెడ్ - సేల్స్ & మార్కెటింగ్ (ఎమ్ & హెచ్‌సీవీ ట్రక్స్) వినోద్ సహాయ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్‌వీఎల్ఎల్ ఫౌండర్ మరియు ఛీఫ్ మెటర్ ఆర్‌సి బైద్ మాట్లాడుతూ... తాము తొలిసారిగా టాటా వాహనాన్ని 1988లో కొనుగోలు చేశామని అప్పటి నుండి ఇప్పటి వరకూ టాటా ఎమ్ & హెచ్‌సీవీ మరియు ఎల్‌సీవీ ట్రక్కులను కొంటూనే ఉన్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో టాటాతో తమ సాన్నిహిత్యాన్ని ఇలానే కొనసాగిస్తామని, అలాగే తమ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తామని ఆయన తెలిపారు.