విదేశాల్లో ప్లాంట్‌ల ఏర్పాటును పరిశీలిస్తున్న టాటా మోటార్స్

అయితే, ప్లాంట్ల ఏర్పాటుకు ఏయే దేశాలను ఎన్నుకున్న విషయాన్ని మాత్రం కంపెనీ తన నివేదికలో ప్రస్తావించలేదు. కాగా.. ఇప్పటికే టాటా మోటార్స్ ఈ నెల ఆరభంలో తమ విదేశీ ప్రణాళికల గురించి ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో అసెంబ్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు టాటా ప్రయత్నిస్తోంది. అంతేకాకకుండా.. తమ ముద్దుల కారు 'టాటా నానో'ను అంతర్జాతీయ మార్కెట్లలోనే ఉత్పత్తి చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గత ఏప్రిల్‌లో టాటా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కిశోర్ ఎ చౌకర్ తెలిపారు. ఇందుకు లాటిన్ అమెరికా, ఆగ్నేయ ఆసియాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం టాటా మోటార్స్‌కు థాయిలాండ్, బంగ్లాదేశ్‌లలో ట్రక్ అసెంబ్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








