పాత కారును అంటగట్టిని డీలరుకు రూ. 27,000 జరిమానా

హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వీరేందర్ జైస్వాల్ ఫిబ్రవరి 17,2009లో హింద్ మోటార్స్ నుంచి ఓ ఇండికా విస్టా కారును రూ. 4,47,994 వెచ్చించి కొనుగోలు చేశాడు. అతను ఈ కారును కొనుగోలు చేసే సమయంలో దాని స్పీడోమీటర్ ప్రకారం అప్పటికే అది 325 కిలోమీటర్లు తిరిగి ఉంది. అయితే దీనిని డీలర్ సమర్థిస్తూ.. ఈ కారును ఢిల్లీ నుంచి ఛండీఘడ్‌కు రోడ్డు ద్వారా తెప్పించామని వెల్లడించాడు. కానీ టాటా మోటార్స్ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం ఆ కారు 2008లోనే తయారుచేయబడింది.
ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న వీరేందర్ వినియోగదారుల పరిరక్షణ చట్టం, 1986లోని సెక్షన్ 12 ప్రకారం సదరు డీలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును పరిశీలించిన ఫోరమ్ వీరేందర్ జైస్వాల్‌ను మోసం చేసినందుకు గానూ హింద్ మోటార్ డీలర్ అతనికి రూ. 25,000 జరిమానాతో రూ. 2,000 లిటిగేషన్ ఖర్చును చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది. లోకంలో ఇలాంటి డీలర్లు కూడా ఉంటారు, కాబట్టి మేలుకో వినియోగదారుడా.. మేలుకో..! ఏదైనా వాహన కొనేటప్పుడు పత్రాలన్నీ సరిగ్గా ఉన్నయో లేదో సరి చూసుకో..!


Click it and Unblock the Notifications








