టాటానానో డెలివరిపై అసంతృప్తి

డిసెంబర్ 2010 వరకు టాటా మోటార్స్ లాట్ నుండి పిక్ చేసినటువంటి లక్షమందిలో 77000 మందికి మాత్రమే అంటే దాదాపు 77000యూనిట్లు మాత్రమే డెలివరి చేయడం జరిగిందని అంటున్నారు. అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే కంపెనీ ప్రతినిధి ఒకరు చాలా మంది కస్టమర్స్ తమయొక్క టాటా నానో కారుని తీసుకోవడానికి ముందుకు రావడంలేదని స్పష్టం చేశారు.
దీని ద్వారా టాటామోటార్స్ కంపెనీ టాటా నానో ని ఓపెన్ సేల్ ద్వారా అమ్మాలని నిర్ణయం తీసుకున్న విషయం తేలిసిందే. కొత్తగా ప్రారంభించినటువంటి సనందా ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 2.5 యాన్యువల్ యూనిట్స్ ఉత్పతి చేసే సామర్ద్యం ఉందన్నారు. డిసెంబర్ 2009లో 5784యూనిట్లు అమ్మిన టాటా మోటార్స్, 2010నవంబర్ కువచ్చేసరికే సేల్స్ అమాంతం పడిపోయి, 509యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఇలా ఒక్కసారిగా సేల్స్ పడిపోవడానికి కారణం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లోచెలరేగినటువంటి నిప్పులు.
దీని తర్వాత టాటా మోటార్స్ వారు టాటా నానోని తమయొక్క కస్టమర్స్ కుదగ్గరకు తీసుకోని వెళ్శడం కోసం సేప్టీ ప్రికాషన్స్ తోపాటు చాలా ఆఫర్స్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మొట్టమొదటి లాట్ లోలక్కి డిప్ ద్వారా ఎన్నికైనటువంటి కస్టమర్స్ కుమాత్రమే లక్షరూపాయలకు ఇవ్వడం, మిగిలిన కస్టమర్స్ కు 3-4శాతం రేటు పెంచిన సంగతి తెలిసిందే. దీని వలన ఇప్పుడు టాటానానో ఖరీదు ఇప్పుడు సుమారు రూ 1.38లక్షల నుండి రూ 1.89లక్షల వరకు ఉండడం విశేషం.


Click it and Unblock the Notifications








