టాటా ఆరియాపై టాటా మోటార్స్ భారీ అంచనాలు

Tata Aria
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తాజా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన చౌక రకం టూ-వీల్ డ్రైవ్ క్రాసోవర్ 'టాటా ఆరియా' మోడల్‌పై కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది. రానున్న నెలల్లో ఈ మోడల్‌కు డిమాండు ఊపందకోగలదని, తద్వారా ఈ మోడల్ మరిన్ని యూనిట్లు అమ్ముడు కాగలవని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. "రానున్న నెలల్లో మరిన్ని యూనిట్లను విక్రయించగలమని అంచనా వేస్తున్నాం.. పూర్తి లగ్జరీతో సిటీ డ్రైవింగ్ కోరుకునే వారి కోసం ఈ మోడల్‌ను రూపొందించామ"ని టాటా మోటార్స్ కమర్షియల్ ప్యాసింజర్ బిజినెస్ వైస్-ప్రెసిడెంట్ ఆర్ రామ క్రిష్ణన్ తెలిపారు.

తమిళనాడు మార్కెట్లో కొత్త టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన టాటా ఆరియా క్రాసోవర్ కారును విడుదల చేసిన సందర్భంగా ఆయన విషయాన్ని వెల్లడించారు. గతేడాది అక్టోబర్ నెలలో టాటా మోటార్స్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన టాటా ఆరియా 4x4 క్రాసోవర్ కారును విడుదల చేసింది. అయితే ఈ మోడల్‌కు ఆశించినంత మార్కెట్ స్పందన లభించక పోవడంతో ఇందులో టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో చౌక వేరింయట్‌ను విడుదల చేసింది. చెన్నయ్ మార్కెట్లో టాటా ఆరియా 4x2 ప్రారంభ మోడల్ ధర రూ. 11.57 లక్షలుగా ఉంటే హై-ఎండ్ వేరియంట్ ధర రూ. 14.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, చెన్నయ్)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 6, 2011, 13:55 [IST]
English summary
Auto major Tata Motors is aiming to sell more units of its latest crossover Aria 4x2 variant in the coming months owing to increase in demand, a senior company official said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+