'ఫోర్బ్స్ గ్లోబల్ 2000' కంపెనీల జాబితాలో టాటా మోటార్స్

Tata Motors
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ గ్లోబల్ కంపెనీల జాబితాలో‌ భారత్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ కూడా స్థానం సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 2000 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాలో మొత్తం 57 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాను రూపొందించింది. కాగా.. ఈ జాబితాలో 20.2 బిలియన్ డాలర్ల అమ్మకాలతో టాటా మోటార్స్ 512వ ర్యాంక్‌ను సాధించింది.

ఇంకా.. ఈ జాబితాలో స్థానం సంపాదించిన భారతీయ కంపెనీల్లో 45.3 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 121వ ర్యాంక్ సాధించగా, భారతీయ స్టేట్ బ్యాంక్ 29.1 బిలియన్ డాలర్ల అమ్మకాలతో 136వ స్థానం, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ 22.6 బిలియన్ డాలర్ల అమ్మకాలతో 172వ స్థానం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 52.1 బిలియన్ డాలర్ల అమ్మకాలతో 243వ స్థానంలో నిలిచాయి.

అంతే కాకుండా.. ఐసిఐసిఐ బ్యాంక్ (288వ ర్యాంక్), ఎన్‌టిపిసి (348 ర్యాంక్), కోల్ ఇండియా (418 ర్యాంక్), భారతీ ఎయిర్‌టెల్ (453 ర్యాంక్), లార్సెన్ అండ్ టర్బో (499 ర్యాంక్)లు కూడా ఉన్నాయి. కాగా, ప్రపంచ అతిపెద్ద (మేటి) సంస్థల ఫోర్బ్స్ జాబితాలో వరుసగా రెండో ఏడాది కూడా జెపి మోర్గాన్ చేజే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ఆరవ స్థానంలో ఉన్న హెచ్‌ఎస్‌బిసి ఈసారి రెండో స్థానాన్ని ఆక్రమించుకుంది.

More from DriveSpark

Article Published On: Monday, April 25, 2011, 10:39 [IST]
English summary
Total 57 Indian companies including Tata Motors occupied th place in Forbes Global 2000 list. Figure in The Forbes Global 2000 list of public companies based on their rankings for sales, profits, assets and market value. Tata Motors gained 512 rank with $20.2 billion sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+